Jatha Kalise

Lyrics by : Ramajogayya Sastry



పల్లవి:


జత కలిసే. జత కలిసే. జగములు రెండు జతకలిసే.

జత కలిసే. జత కలిసే. అడుగులు రెండు జతకలిసే.

జనమొక తీరు వీళ్లదొక తీరు ఇద్దరొకలాంటి వారు

అచ్చు గుద్దినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు

ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరూ.

చదివేస్తున్నా రానందంగా ఒకరిని ఇంకొకరూ..


చరణం: 1


నలుపు జాడ నలుసైనా అంటుకోని హృదయాలూ. .

తలపు లోతున ఆడమగలని గుర్తులేని పసివాళ్లూ.

మాటలాడుకోకున్న మది తెలుపుకున్న భావాలూ..

ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలూ.

పేరుకేమో వేరు వేరు బొమ్మలేమరీ

ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా...

బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో. ఒకరే ఇద్దరు అయ్యారూ.

ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరూ.

చదివేస్తున్నా రానందంగా ఒకరిని ఇంకొకరూ.ఊ


ఏహే. హే....ఏహే. హే. ఏహే. హే....ఏహే.


చరణం: 2


ఉన్నచోటు వదిలేసీ. ఎగిరిపోయెనీ లోకం

ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వడం కోసం

నీలి రంగు తెర తీసీ. తొంగి చూసే ఆ.కా.శం

చూడకుండా ఈ అద్బుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం

నిన్నదాక ఇందుకేమో వేచి ఉన్నదీ.

ఎడతెగని సంబరాన తేలినారు నే.డిలా..

ఇప్పుడే కలిసి అప్పుడే వీరు ఎపుడో కలిసిన వారయ్యారు


ఏ... కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు

చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరూ..