Jaago
Lyrics by : Ramajogayya Sastry
నేల నేల నేలా. నవ్వుతోంది నాలా
నట్ట నడిబొడ్డు సూరీడులా
వేల వేల వేల... సైన్యమై
ఈ వేళ దూసుకెళ్లమంది నాలో కలా
సర్ర సరా సరా... ఆకాశం కోసేసా.
రెండు రెక్కలు తొడిగేసా... తొడిగేసా.
గిర్ర గిరా గిరా... భూగోళం చుట్టూరా
గుర్రల వేగంతో తిరిగేసా... తిరిగేసా.
ఏ కొంచం కల్తీలేని కొత్త చిరుగాలై
ఎగరేసా సంతోషాల జండా... జండా.
జాగో జాగోరే.. జాగో జాగోరే..
జాగో జాగోరే.. జాగో
జాగో జాగోరే.. జాగో జాగోరే..
జాగో జాగోరే.. జాగో.. ఓ...
చరణం: 1
ఉమ్మ్. వెతికా నన్ను నేనూ
దొరికా నాకు నేనూ.
నాలో నేనే ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగీ.
పంచేస్తాను నన్ను పరిచేస్తాను నన్నూ.
ఎనిమిదిక్కులన్ని పొంగిపోయి ప్రేమై వెలిగీ.
గుమ్మ గుమ్మా గుమ్మా... గుండెల్ని తాకేలా
గంధాల గాలల్లే వస్తా... హే వస్తా
కొమ్మకొమ్మా రెమ్మా... పచ్చంగ నవ్వేలా
పన్నీటి జల్లుల్నే తెస్తా... హే తెస్తా.
ఎడారిని కడలిగ చేస్తా... చేస్తా.
జాగో జాగోరే.. జాగో జాగోరే..
జాగో జాగోరే.. జాగో
జాగో జాగోరే.. జాగో జాగోరే..
జాగో జాగోరే.. జాగో.. ఓ...
చరణం: 2
ఉమ్మ్. స్వార్ధం లేని చెట్టు బదులే కోరనంటూ
పూలు పళ్ళు నీకు నాకు ఎన్నో పంచుతుందే
ఏమీ పట్టనంటు బంధం తెంచుకుంటు
మనిషే సాటి మనిషిని చూడకుంటే అర్థం లేదే
సల్ల సలా సలా... పొంగిందే నా రక్తం
న చుట్టూ కన్నీరే కంటే.. హే కంటే
విల్ల విలావిలా... అల్లాడిందే ప్రాణం
చేతైన మంచే చేయకుంటే... చేయకుంటే
ఇవ్వాలనిపించదా ఇస్తూ ఉంటే... ఉంటే.
జాగో జాగోరే.. జాగో జాగోరే..
జాగో జాగోరే.. జాగో
జాగో జాగోరే.. జాగో జాగోరే..
జాగో జాగోరే.. జాగో.. ఓ... జాగో !!