Virisinadee
Lyrics by : Sirivennela Seetharama Sastry
విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా.
విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా.
మనసే మందారమై. వయసే మకరందమై.
అదేదో మాయ చేసినదీ....
విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా.
చరణం: 1
ఝుమ్మంది నాదం. రతివేదం.
జతకోరే. భ్రమరనాదం.
రమ్మంది మోహం. ఒక దాహం.
మరులూరే భ్రమలమై.కం
పరువాల వాహినీ. ప్రవహించే ఈమనీ.
ప్రభవించె ఆమనీ. పులకించె కామినీ.
వసంతుడే చెలికాంతుడై
దరిచేరె మెల్లగా......
విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా.
చరణం: 2
ఋతువు మహిమేమో.విరితేనే.
జడివానై. కురిసె తీ.యగా.
లతలు పెనవేయ మైమరచీ
మురిసే.ను తనువు హాయిగా.
రాచిలుక పాడగా. రాయంచ ఆడగా.
రసలీల తోడుగా. తనువెల్ల ఊగగా.
మారుడే సుకుమారుడై.
జతకూడె మా..యగా.
విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా.
విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా......
మనసే మందారమై.వయసే మకరందమై.....
అదేదో మాయ చేసినది....
విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా.
విరిసినదీ.. వసంత గానం వలపుల పల్లవిగా...ఆ..