Enta Enta Vintamoahamo

Lyrics by : Sirivennela Seetharama Sastry



పల్లవి :


చందమామ వచ్చినా చల్లగాలి వీచినా

చిచ్చు ఆరదేలనమ్మా.

ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా.

చందనాలు పూసినా ఎంత సేవ చేసినా

చింత తీరదేలనమ్మా.

ఓ సఖియా ఉన్నమాట ఒప్పుకోమ్మా.

జంట లేదనా. ఆహాహా.

ఇంత వేదనా... ఓహోహో.

జంట లేదనా. ఇంత వేదనా.

ఎంత చిన్నబోతివమ్మా...


చందమామ వచ్చినా చల్లగాలి వీచినా

చిచ్చు ఆరదేలనమ్మా.

ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా.

ఓ సఖియా ఉన్నమాట ఒప్పుకోమ్మా.


ఓ..... మురిపాల మల్లికా.

దరిజేరుకుంటినే పరువాల వల్లిక...

ఇది మరులుగొన్న మహిమో

నిను మరువలేని మై.కమో..


ఎంత ఎంత వింత మో.హమో..

రతికాంతుని శృంగార మంత్రమో..

ఎంత ఎంత వింత మో.హమో..

రతికాంతుని శృంగార మంత్రమో..

మరు మల్లెల శరమో విరి విల్లుల శరమో

మరు మల్లెల శరమో విరి విల్లుల శరమో

ప్రణయానుబంధమెంత చిత్రమో.


ఎంత ఎంత వింత మో.హమో..

రతికాంతుని శృంగార మంత్రమో..



చరణం : 1


విరిసిన వనమో యవ్వనమో.

పిలిచింది చిలిపి వేడుకా.

కిలకిల పాటగా.

చలువల వరమో కలవరమో

తరిమింది తీపి కోరికా.

చెలువను చూడగా.

దరిశనమీయవే సరసకు చేరగా.

తెరలను తీయవే. తళుకుల తారకా.

మదనుడి లేఖ శశిరేఖ అభిసారికా.


ఎంత ఎంత వింత మో.హమో..

రతికాంతుని శృంగార మంత్రమో..


చరణం : 2


కలలను రేపే కళ ఉంది

అలివేణి కంటి సైగలో..

జిగిబిగి సోకులో.

ఎడదను ఊపే ఒడుపుంది

సుమబాల తీగ మేనిలో.

సొగసుల తావిలో.

కదలని ఆటగా. నిలిచిన వేడుకా.

బదులిడ రావుగా. పిలిచిన కోరికా.

బిడియమదేల ప్రియురాల మణిమేఖలా.


ఎంత ఎంత వింత మో.హమో..

రతికాంతుని శృంగార మంత్రమో..

మరు మల్లెల శరమో విరి విల్లుల శరమో

మరు మల్లెల శరమో విరి విల్లుల శరమో

ప్రణయానుబంధమెంత చిత్రమో.


ఎంత ఎంత వింత మో.హమో..

రతికాంతుని శృంగార మంత్రమో..