Rock on Bro

Lyrics by : Ramajogayya Sastry



పల్లవి:


రాక్‌ ఆన్ బ్రో అంది సెలవు రోజు

గడిపేద్దాం లైఫు కింగు సైజు

ఒకే గదిలో ఉక్కపోత చాలు

గడి దాటాలి కళ్ళు కాళ్లు కలలు

ఏ దిక్కులో ఏమున్నదో

వేటాడి పోగు చేసుకుందాం ఖుషీ

మన్నాటలో చంటోడిలా

ఆహా అనాలి నేడు మనలో మనిషి


చరణం: 1


మనసిపుడు మబ్బులో విమానం

నేలైనా నింగితో సమానం

మత్తుల్లో ఇదో కొత్త కోణం

కొత్త ఎత్తుల్లో ఎగురుతుంది ప్రాణం

ఆనందమో ఆశ్చర్యమో

ఏదోటి పొందలేని సమయం వృధా

ఉత్తేజమో ఉల్లాసమో

ఇవాల్టి నవ్వు రంగు వేరే కదా


చరణం: 2


మనమంతా జీన్సు ప్యాంటు రుషులు

బ్యాక్‌ ప్యాక్‌ లో బరువు లేదు అసలు

విన్లేదా మొదటి మనిషి కథలు

అలా బతికేద్దాం ఓ నిండు రేయి పగలు

ఇదీ మనం ఇదే మనం

క్షణాల్ని జీవితంగా మార్చే గుణం

ఇదే ధనం ఈ ఇంధనం

రానున్న రేపు వైపు నడిపే బలం