O Papa Laali

Lyrics by : Veturi Sundararama Murthy



ఓ పాపా లాలి జన్మకే లాలి

ప్రేమకే లాలి పాడనా తియ్యగా

ఓ పాపా లాలి జన్మకే లాలి

ప్రేమకే లాలి పాడనా

ఓ పాపా లాలి


చరణం: 1


నా...జోలలా లీలగా తాకాలని

గాలినే కోరనా జాలిగా

నీ... సవ్వడే సన్నగా ఉండాలని

కోరనా గుండెనే కోరిక

కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో

తడినీడలు పడనీకే ఈ దేవత గుడిలో

చిరు చేపల కనుపాపలకిది నా మనవి


ఓ పాపా లాలి జన్మకే లాలి

ప్రేమకే లాలి పాడనా తియ్యగా

ఓ పాపా లాలి


చరణం: 2


ఓ... మేఘమా ఉరమకే ఈ పూటకీ

గాలిలో తేలిపో వెళ్ళిపో

ఓ... కోయిలా పాడవే నా పాటని

తియ్యని తేనెలే చల్లిపో

ఇరు సందెలు కదలాడే ఎద ఊయల ఒడిలో

సెలయేరుల అలపాటే వినిపించని గదిలో

చలి ఎండకు సిరివెన్నెలకిది నా మనవి


ఓ పాపా లాలి జన్మకే లాలి

ప్రేమకే లాలి పాడనా తియ్యగా

ఓ పాపా లాలి జన్మకే లాలి

ప్రేమకే లాలి పాడనా

ఓ పాపా లాలి