Adiga Adiga

Lyrics by :


అడిగా. అడిగా. పంచ ప్రాణాలు నీ రాణిగా.

జతగా. జతగా. పంచు నీ ప్రేమ పారాణిగా.

చిన్న నవ్వే రువ్వి మార్చేసావే

నా తీరు నీ పేరుగా..

చూపు నాకే చుట్టి కట్టేసావే.

నన్నేమో సన్నాయిగా

కదిలే. కలలే. కన్న వాకిళ్ళలో కొత్తగా.

కౌగిలే. ఓ సగం పొలమారిందిలే వింతగా.


అడిగా. అడిగా. పంచ ప్రాణాలు నీ రాణిగా

జతగా. జతగా. పంచు నీ ప్రేమ పారాణిగా


చరణం: 1


సరిలేని సమారాలు సరిపోని సమయాలు

తొలిసా.రి చూసాను నీతో.

వీడిపోని విరహాలు వీడలేని కలహాలు

తెలిపాయి నీ ప్రేమ నాతో..


ఎల్లలేవి లేని ప్రేమే నీకే.

ఇచ్చానులే నేస్తమా..

వెళ్లలేని నేనే నిన్నే దాటి

నూరేళ్ళ నా సొంతమా.


కననీ. విననీ. సుప్రభాతాల సావసమా

సెలవే కోరని సిగ్గు లోగిళ్ల శ్రీమంతమా


అడిగా. అడిగా. పంచ ప్రాణాలు నీ రాణిగా

జతగా. జతగా. పంచు నీ ప్రేమ పారాణిగా


చరణం: 2


సింధూర వర్ణాల చిరునవ్వు హారాలు

కలబోసి కదిలాయి నాతో.

మనిషేమో సెలయేరు మనసేమో బంగారు

సరిపోవు నూరేళ్లు నీతో.

ఇన్ని నాళ్ళు లేనే లేదే

నాలో. నాకింత సంతోషమే

మళ్ళీ జన్మే ఉంటే కావాలంట

నీ చెంత ఏకాంతమే


కదిలే కలలే కన్నా వాకిళ్ళలో కొత్తగా.

కౌగిలే ఓ సగం పొలమారిందిలే వింతగా.


అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా.

జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా.