Aale Baale

Lyrics by : Bhaskarabhatla Ravi Kumar



ఆలె బాలే ఆలె బాలే తీన్‌మారేలే

ఆలె బాలే ఆలె బాలే ధూమ్‌ధామేలే

అర్థంలేని పరదాలు పీకి పారేద్దాం

పీకల్లోతు ఫ్రీడమ్‌లో మునిగి తేలేద్దాం

గుండెలోపలి భారం ఇవ్వాళ దించుకుందాం

కళ్లగంతలు తీసి కొత్తలోకం చూద్దాం

ఎందుకీ మొహమాటం చాలు చాలు అందాం

హాయి దారుల్లో సాగిపోదాం

మనలా మనమున్న చోట సంతోషమంతా శివతాండవాడుతుందే


ఆలె బాలే ఆలె బాలే దుమ్ము రేపాలే

ఆలె బాలే ఆలె బాలే కెవ్వు కేకేలే

ఈగోలన్నీ స్విచ్ఛాఫ్ చేసి పెట్టేద్దాం

సంతోషాలే గుప్పిట్లో పట్టి దాచేద్దాం

గూగుల్ అంతా వెతికి సరదాల జాడ పడదాం

అల్లరల్లరి చేసి యూట్యూబ్‌లోన పెడదాం

రెండు మనసుల ఫీలింగ్సు ప్రింటు తీసుకుందాం

దాచుకోకుండా ఓపెనైపోదాం

మన ఇద్దరి మధ్యనున్న పంతాల అడ్డుగోడల్ని పగలకొడదాం


ఆలె బాలే ఆలె బాలే పిచ్చ హ్యాపీలే

ఆలె బాలే ఆలె బాలే రచ్చరచ్చేలే

చూసేవాళ్లు ఈ జాతరేంటనడగాలే

నవ్వేవాళ్లు మరి నవ్వుకున్న ఫరవాలే

నచ్చినట్టే ఉందాం ఇక తోచినట్టే చేద్దాం

వేల ఆనందాలు సంచుల్లో నింపుకుందాం

స్పీడు మీద ఉన్నాం ఎవడాపుతాడో చూద్దాం

దారికడ్డొస్తే లాగి తన్నేద్దాం

మనలా ఎవరుండలేరు అని వల్లకాదు

అని బల్లగుద్ది చెబుదాం